బిజెపిలో చేరిన పలువురు యువకులు

56చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం 3వ వార్డ్ వల్లబ్ నగర్ కు చెందిన పలువురు బీఆర్ఎస్ నాయకులు, మహిళలు శనివారం బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా నాయకుడు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ రాష్ట్రంలో గాని, నర్సంపేట నియోజకవర్గంలో గాని యువతకు కేవలం బీజేపీ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుందని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో యువతకు పెద్దపీట వేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్