ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాని, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు గాని మన ఫోన్ లో ఉండే SOS ఫీచర్ సహాయపడుతుంది. ఈ సెట్టింగ్ కొసం ముందుగా ఆండ్రాయిడ్ ఫోన్ లో సెట్టింగ్స్ ఆప్షన్‌లోకి వెళ్లి Emergency లేదా SOS ఎంపికపై క్లిక్ చేయండి. SOSను ఆన్ చేసుకోవాలి. ఇక్కడ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఆప్షన్‌పై క్లిక్ చేసి ఆత్మీయుల ఫోన్ నంబర్, బ్లడ్ గ్రూప్ లాంటి వివరాలు నమోదు చేయాలి. దీనివల్ల ఫోన్ లాక్ ఉన్నప్పటికీ ఎమర్జెన్సీ నంబర్ కు సమాచారం ఇచ్చే అవకాశం ఉంటుంది.