మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

802చూసినవారు
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
నర్సంపేట లో ఇటీవల అనారోగ్యంతో మరణించిన చెక్క చిన్న మల్లయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి "ఆపద నేస్తం అందరికి సహాయం" గ్రూప్ సభ్యులచే ఆర్థిక సహాయంగా 3000/-రూపాయలు నగదు గురువారం అందజేశారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యులు గ్రూప్ సభ్యులుకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో "ఆపద నేస్తం అందరికి సహాయం" సభ్యులు గొట్టిముక్కుల పెద్ద కుమారస్వామి, డా. భానోత్ మోహన్ లాల్, ఉప్పునూతల శ్రీవిష్ణు, మనికంటి ప్రదీప్‌, పులి రమేష్ గౌడ్‌ వాంకుడోత్ రోహిత్ అలాగే మరణించిన వారి అన్నా కుమారస్వామి, వదిన విజయ, మృతిని భార్య పుష్పనీలా, కొడుకు శ్రావన్‌, కూతురు ఆమని, కుటుంబ సభ్యుడు చెక్క శ్రీకాంత్, పాల్గొన్నారు. గ్రూప్ సభ్యులు తోచిన ఆర్థిక సహాయం అందించిన వారికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్