శాకాంబరిగా మహాలక్ష్మి అమ్మవారు

56చూసినవారు
శాకాంబరిగా మహాలక్ష్మి అమ్మవారు
వరంగల్ నగరం నర్సంపేట రోడ్డులోని హోల్ సేల్ కాంప్లెక్స్లో వేంచేసి ఉన్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆదివారం శాకాంబరిగా అలంకరించారు. ఆలయ అర్చకులు అన్నవజ్జల భరత్ కుమార్ ఆధ్వర్యంలో అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అనంతరం అన్న ప్రసాద వితరణ గావించారు. కార్యక్రమంలో హోల్ సేల్ కాంప్లెక్స్ ప్రతినిధులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్