ఆసరా పించన్లు వెంటనే విడుదల చేయాలి

2138చూసినవారు
ఆసరా పించన్లు వెంటనే విడుదల చేయాలి
రాష్ట్రంలో ఇంత వరకు విడుదల కాని ఆసరా పింఛన్లు వెంటనే విడుదల చేయాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు పులి రమేష్ గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. నర్సంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత నెలలో బడ్జెట్ సమావేశాలు కారణంగా పెన్షన్లు ఆలస్యంగా విడుదల చేశారని కానీ ఈ నెలలో ఇంతవరకు పింఛన్లు రాక రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులు, నేత, గీత, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆసరా పెన్షన్ లు సకాలంలో పంపిణీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కాసర్ల సాంబరెడ్డి, మామిడి శ్రీను, కామ గాని మల్లమ్మ, రాజు తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్