సావిత్రిబాయి పూలే 125 వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

459చూసినవారు
సావిత్రిబాయి పూలే 125 వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు
అన్నగారి వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే 125 వ వర్ధంతి నల్లబెల్లి మండల కేంద్రంలో మొట్టమొదటి అక్షర జ్యోతి సర్గియా సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య, వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షులు పులి రమేష్ గౌడ్ మాట్లాడుతూ సమాజంలో అణగారి వర్గాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు అత్యున్నత సేవలు అందించిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే వారి జీవితం సమాజానికి ఆదర్శం మహనీయులను ఆదర్శంగా తీసుకొని సమాజంలో యువకులు విద్యావంతులు మేధావులు సంఘసంస్కర్తలు ఇటువంటి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించుకోవడం వల్ల వారు సమాజానికి అందించిన విశిష్ట సేవలను గుర్తు చేసుకోవడమే కాకుండా సమాజంలో వారిని సగర్వంగా గౌరవించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల మాజీ అధ్యక్షులు పరికి రత్నం గోనే నాగిరెడ్డి నాగేల్లి కొమరమ్మ బొర్రా సరోజన తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్