మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలంలోని పోలేపల్లి గ్రామంలో చేపల వేటకు వెళ్లి శుక్రవారం వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన పులుగుజ్జ సురేష్ ముదిరాజ్ (35) అనే మత్స్యకారుడు చేపల వేటకు వెళ్ళి చెరువు వద్ద స్పృహతప్పి పడిపోవడంతో స్థానికులు తొర్రూర్ పట్టణ కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స అందిస్తుండగా మృతి చెందాడు మృతునికి భార్య హేమలత ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది