విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పాడి గేదె మృతి

1966చూసినవారు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పాడి గేదె మృతి
పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలకేంద్రంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పాడి గేదె మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. గ్రామంలోని కొత్తవాడ కు చెందిన ఉప్పుల అంజయ్య అనే రైతుకు చెందిన పాడి గేదె విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో చనిపోగా విషయం తెలుసుకున్న రైతు కుటుంబం అక్కడికి చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపించారు. సుమారు లక్ష రూపాయల నష్టం కలిగిందని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతు కుటుంబం కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్