జనగాం జిల్లా పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన నిలారపు సోమయ్య అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. గురువారం ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఉపాధ్యాయులు సూర్యప్రకాష్ అందించిన 25 కిలోల బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలను అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ యతిపతి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి జీడి హరీష్ లు అందించారు. ఈ కార్యక్రమంలో కుమారస్వామి, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.