మనం చేసే రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అన్నారు. గురువారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన రక్తదాన శిబిరానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేస్తే ఆరోగ్యంగా ఉంటారు అని తెలిపారు. అనంతరం రక్తం దానం చేసిన వారికి సర్టిఫికెట్ల ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తొర్రూర్ డివిజన్ పరిధిలోని సీఐలు ఎస్సైలు పోలీస్ సిబ్బంది, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు.