భక్తి శ్రద్ధలతో శ్రీ సోమేశ్వర ఆలయ గిరిప్రదక్షణ

70చూసినవారు
భక్తి శ్రద్ధలతో శ్రీ సోమేశ్వర ఆలయ గిరిప్రదక్షణ
జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని స్వయంభువు శ్రీ చండిక సమేత శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో గిరిప్రదక్షణ నిర్వహించారు. ఆదివారం గురుపౌర్ణమి సందర్భముగా నిర్వహించిన గిరిప్రదక్షణ కార్యక్రమంలో పలువురు భక్తులు హాజరై భక్తి శ్రద్ధలతో గిరిప్రదక్షణ నిర్వహించారు. అనంతరం శ్రీ చండిక సమేత శ్రీ సోమేశ్వర లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్