రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

504చూసినవారు
రాష్ట్ర ప్రజలకు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి
రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి వరంగల్ జిల్లా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ‘శోభకృత్’ నామ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

జీవితానికి ప్రతీక ఈ ఉగాది షడ్రుచులు. శిశిరం నుంచి వసంతంలోకి అడుగుపెట్టి, చెట్లు చిగుర్చి ప్రకృతి శోభాయమానంగా వుండే కాలం. ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. షడ్రుచుల సమ్మేళనం - తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్