జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని అతి పురాతనమైన, మహిమాన్వితమైన కోరికలు తీరుస్తూ భక్తుల పాలిట కొంగు బంగారంలా విలసిల్లుతున్న శ్రీ పాటిమీది ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించారు. ఆదివారం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు.