పాలకుర్తి: చిట్యాల రామచంద్రంకి తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నివాళి

67చూసినవారు
పాలకుర్తి: చిట్యాల రామచంద్రంకి తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు నివాళి
పాలకుర్తి పట్టణ మాజీ సర్పంచ్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చిట్యాల ఐలమ్మ మనుమడు చిట్యాల రామచంద్రం ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కొత్తగట్టు మల్లయ్య శుక్రవారం వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుమారుడు సంపత్ కోడలు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేతను పరామర్శించారు. వారి మరణం ప్రజాఉద్యమాలకు తీరని లోటు అన్నారు.

సంబంధిత పోస్ట్