గర్భిణులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి

274చూసినవారు
గర్భిణులు పౌష్టికాహారాన్ని తీసుకోవాలి
గర్భిణీ మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలని పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు సిడిపిఓ హైమావతి అన్నారు. మంగళవారం తొర్రూర్ డివిజన్ కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో ఉన్న అంగన్వాడి సెంటర్ లో తల్లి పాల వారోత్సవాలు భాగంగా గర్భిణీలకు శ్రీమంతాలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహారం లోపంతో శిశు ఎదుగుదలలో లోపాలు వస్తాయని, విధిగా గర్భిణీలు పోషకాహారాన్ని తీసుకొని ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసిడిపిఓ ఇందిరా, సూపర్ వైజర్ శోభ, డాక్టర్ ప్రియాంక, పాఠశాల హెచ్ఎం రాజ సుకన్య, విజయమ్మ, అంగన్వాడి టీచర్ జన్ను లలిత, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్