వృధాగా దాతలు అందించిన ప్యూరిఫైయర్ మిషన్

432చూసినవారు
వృధాగా దాతలు అందించిన ప్యూరిఫైయర్ మిషన్
పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి వచ్చే పేషంట్ల కోసం మంచి నీటి వసతి లేక ఇబ్బంది పడుతుండడంతో వావిలాల గ్రామస్తులు మహాత్మా హెల్పింగ్ హాండ్స్ సొసైటీ వ్యవస్థాపకులు గంటా రవీందర్ 10 వేలు వెచ్చించి ఫ్యూరి ఫైడ్ వాటర్ మిషినరిని ఏర్పాటు చేయగా.. దాన్లో మంచి నీళ్ళు పోసేవారు లేక బాగోగులు చూసేవారు లేక ఆసుపత్రికి వచ్చే పేషంట్లు, కరోనా పరీక్షల కోసం వచ్చే వారు వేసవి కాలంలో దాహార్తిని తీర్చుకోలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శనివారం ఆసుపత్రి వచ్చిన పలువురు ఇబ్బందులు పడ్డారు. టీకా వేసుకోవడానికి వారందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొకోవడంతో పేషంట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు చొరవ చూపి ఆసుపత్రికి వచ్చే వారికి మంచినీటిని అందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్