మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండలంలోని మాటేడు గ్రామ శివారు వద్ద పట్టణంకి చెందిన నలంద స్కూల్ బస్సు ప్రమాదవశాత్తు బోల్తాపడడంతో విద్యార్థులకు గాయాలు అయ్యాయి. గుర్తించిన స్థానికులు 108కు పోలీసులకు సమాచారం అందించారు. స్కూల్ బస్సులో పిల్లలు ఎక్కువ శాతం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి స్థానికులు చేరి సహాయక చర్యలు అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.