లయన్స్ క్లబ్ తొర్రూర్ ఆధ్వర్యంలో గురువారం పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మున్సిపల్ కేంద్రంలో లయన్స్ క్లబ్ చార్టెడ్ గవర్నర్ కుందూరు వెంకటరెడ్డి జన్మదిన సందర్భంగా పేద ప్రజలకు నిత్యవసర సరుకులు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ టీచర్స్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, చింతల సురేష్, శ్రీనివాస్, రమేష్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.