జూలై 1వ తేదీన నిర్వహించే గ్రూప్ 4 పరీక్షలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు ఆర్టీసీ డిపో మేనేజర్ కే పరిమళ ప్రకటనలో తెలిపారు. జూలై ఒకటవ తేదీ శనివారం వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం రోడ్లలో ప్రత్యేక. బస్సులు నడుపుతున్నామని తెలిపారు. తొర్రూర్, మరిపెడ, వర్ధన్నపేట బస్టాండ్ లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.