వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం గట్టికల్ గ్రామ చెరువు వద్ద జరుగుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించి, కూలీలతో కలిసి కొద్ది సేపు గడ్డపార పట్టి మట్టి తోవ్వి, డబ్బతో మట్టిని ట్రాక్టర్ లో పోసి పనులు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలను ఆదుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.