పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మున్సిపాలిటీ కేంద్రంలో మంగళవారం మధ్యాహ్నం పంటపగలే దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి చోరీ చేసిన సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు బాధితుల కథనం ప్రకారం పట్టణంలోని బీరప్ప నగర్ కు చెందిన వెంకటేశ్వర్లు ఎలక్ట్రిషన్ ఇంట్లో దొంగలు తాళాలు పగలగొట్టి లక్ష రూపాయల నగదు, ఐదు తులాల బంగారాన్ని చోరీకి చేసినట్లు గుర్తించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.