మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెలికట్టే గ్రామంలో శుక్రవారం మన్నెం పద్మయ్యకు చెందిన పెంకుటిల్లు ప్రమాదవశాత్తు దగ్ధమైంది. మంటలు చెలరేగి ఇంట్లో సామాన్లు, నిత్యవసర సరుకులు పూర్తిగా దగ్ధం అయ్యాయి. ఫైరింజన్ రాకపోవడంతో స్థానికులు గమనించి మంటలను అదుపు చేశారు. మంటల్లో సామాన్లు కాలిపోయాయని తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.