చాంబర్ ఆఫ్ కామర్స్ తొర్రూర్ సమావేశంలో ఇటీవల కాలంలో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ వేడుక ఆర్ఎస్ లక్ష్మి గార్డెన్స్ లో జరిగింది. ఈ వేడుకలో పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశస్విని ఝాన్సీ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.