అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ: ఎమ్మెల్యే

80చూసినవారు
అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ: ఎమ్మెల్యే
గీసుగొండ మండలంలో ఊకల్ రైతు సేవా సహకార సంఘం చైర్మన్ల అధ్యక్షతన సోమవారం 40వ మహాజనసభ జరిగింది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన రెండు లక్షల రుణమాఫీ అమలు కాలేదని, తమకు రుణమాఫీ అమలు జరిగేలా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు. అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్