నెక్కొండ మండల కేంద్రంలో సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం వరంగల్ జిల్లా కమిటీ నాయకులతో వ్యవస్థాపక అధ్యక్షుడు వీరస్వామి గౌడ్ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ రాష్ట్రంలో గౌడులకు రాష్ట్ర ప్రభుత్వం గీత కార్మికుల రక్షణ కోసం కాటమయ్య రక్షణ కవచాలు అందించడం సంతోషకరమన్నారు.కానీ నిజంగా అర్హులైన ప్రతి గీత కార్మికులకు రక్షణ కవచాలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.