గౌడకులస్తుల ఆరాధ్య దైవం కంఠమహేశ్వర స్వామి సురమాంబదేవి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామంలో బుధవారం పాఠంకథ నుండీ మొదలుకొని శనివారము బోనాలు మరియు కంఠమహేశ్వర స్వామి సురమాంబదేవి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గౌడకులస్తుల కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో, గ్రామస్థులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.