గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే గ్రామ పంచాయితీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్ల చలువేనని జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డిఆర్డీఓ కౌసల్య దేవి అన్నారు. గీసుకొండ మండలములోనీ ఊకల్ గ్రామాన్ని శుక్రవారం సందర్శించి గ్రామములో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. సీఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ.. తడి, పొడి చెత్తను ఓపికగా సమీకరించి డంపింగ్ యార్డ్ లకు చేర్చే మల్టీ పర్పస్ వర్కర్ల సేవలు మరువలేనివి అన్నారు.