నేటి విద్యార్థులు భావితరాలకు పునాదులు కావాలని ఉన్నత చదువులు చదివి ఉన్నత ఉద్యోగాలు పొంది కన్న తల్లిదండ్రులకు చదువు నేర్పిన గురువులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని నడికూడ మండల తహసిల్దార్ నాగరాజు అన్నారు. గురువారం 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ నాగరాజు మండలంలోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాల విద్యార్థినిలకు పెన్నులు బుక్స్ బహుకరించడం జరిగింది.