నెల్లికుదుర్ మండలము లోని పెద్ద తండా గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బుధవారం పల్లె ప్రగతి దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ మాధవి నవీన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్పంచ్ పరమేశ్వర్ పతాక ఆవిష్కరణ జరిపి తెలంగాణ ప్రభుత్వం పల్లె ల అభివృద్ధి కోసం చేసిన పలు కార్యక్రమాల గూర్చి ప్రజలకు తెలియ చేయడం జరిగింది మరియు పంచాయితీ సిబ్బంది ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాకెందర్, ఉపాధ్యాయులు మహేందర్, రవికుమార్, అశోక్ లు, పంచాయితీ సిబ్బంది, అంగన్వాడీ టీచర్ వనిత, ఆశా శోభ మరియు పెద్దఎత్తున ప్రజలు పాల్గొన్నారు.