Jan 03, 2025, 18:01 IST/
ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయింది: సీఎం రేవంత్
Jan 03, 2025, 18:01 IST
ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయిందని, ప్రతి నెల వస్తోన్న రాబడి సరిపోవడం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి నెలా ప్రభుత్వానికి రూ.18,500 కోట్ల ఆదాయం వస్తోందని, అది సరిపోవడం లేదన్నారు. కనీస అవసరాలకే ప్రతి నెల రూ.22,500 కోట్లు కావాలన్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిలో మార్పులు తీసుకురావడానికి కాస్త సమయం పడుతుందన్నారు. తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు.