మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలి: హరీశ్ రావు

68చూసినవారు
మంత్రులు సభకు ప్రిపేర్ అయ్యి రావాలి: హరీశ్ రావు
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు కాంగ్రెస్ మంత్రులు ప్రిపేర్ అయి రావాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. బీఏసీ సమావేశం తర్వాత హరీశ్ రావు చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. 'ప్రతిపక్షాలకు మైక్ ఇవ్వొద్దని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను బుల్డోజ్ చేస్తున్న విషయాన్ని లేవనెత్తాం. ముఖ్యమైన సమస్యలపై సభలో చర్చ జరగాలని, రైతాంగ సమస్యలు, తాగు నీటి, సాగు నీటి సమస్యలపై చర్చించాలని కోరాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్