తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు

50చూసినవారు
తెలంగాణలో కాకరేపుతున్న ఎండలు
తెలంగాణలో గురువారం నుంచి ఎండలు కాక పుట్టించనున్నాయి. హైదరాబాద్‌, ఉమ్మడి నల్గొండ జిల్లాలో రేపు పగటి పూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకూ నమోదు కానున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇక రాష్ట్రంలోని మిగతా జిల్లాలో దాదాపు ఎండలు మాడిపోతాయని వెల్లడించారు. కాగా, గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావుల్లో నీరు తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్