బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం..

52చూసినవారు
బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం..
బిజెపి పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్థానిక స్టేషన్ ఘనపూర్ జేకే గార్డెన్ లో శ్రీ పెరుమాండ్ల వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, స్టేషన్గన్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి వారి అధ్యక్షతన జరిగిన బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా శ్రీ చాడ శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఆసిఫాబాద్ జిల్లా ఇన్చార్జి ముఖ్య అతిధులుగా విచ్చేసినారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి పార్టీ అధికారంలోకి రాగానే 10 రోజుల్లో దేశపు పదాదికారుల సమావేశం నిర్వహించడం జరిగింది. పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆయన యొక్క ప్రభుత్వంలో, ఆయన నాయకత్వాన్ని విశ్వసించిన ప్రతి భారతీయుడు ఈరోజు బిజెపి పార్టీ వైపు చూస్తున్నారు.బిజెపి పార్టీ అంటే దేశ ప్రగతి కోసం ఎల్లవేళలా కష్టపడే పార్టీ అని, ప్రతి భారతీయుని గుండెల్లో గూడుకట్టుకున్న పార్టీ అని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు.ప్రతి పార్టీకి కార్యకర్తలే పునాది రాళ్ళని అలాంటి కార్యకర్తలను ఎల్లవేళలా బిజెపి పార్టీ కాపాడు కుంటుoదని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు ఈ సమావేశానికి జనగాం జిల్లా అధ్యక్షులు, మరియు శ్రీ వెంకటరెడ్డి, జిల్లా సహప్రముఖ్, శ్రీ యుగంధర్ రెడ్డి, రహీం బేగ్, శ్రీ గుర్రం వెంకన్న, శ్రీ ముదినేపల్లి వెంకన్న, మండల అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ రెడ్డి, ధర్మసాగర్, శ్రీ సంపత్ రెడ్డి , చిల్పూర్, శ్రీ సాయి బాబు రాచర్ల మండల అధ్యక్షులు కూడా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్