జనగామ జిల్లా గ్రంథాలయ సంస్థల ఛైర్మెన్ మారుజోడు రాంబాబు స్టేషన్ ఘనపూర్ డివిజన్ కేంద్రం శివునిపల్లి లోని శాఖాగ్రంధాలయాన్ని సోమవారం సందర్శించారు. గ్రంధాలయంలోని రిజిస్టర్ లను, పోటీ పరీక్షల పుస్తకాలు, నవలలు, ఆధ్యాత్మిక పుస్తకాలను పరిశీలించారు. రోజూ ఎంతమంది పాఠకులు వస్తున్నారు, దిన పత్రికలు ఎన్ని వస్తున్నాయి అంటూ వివరాలను అరా తీశారు. గత బిఅరెస్ ప్రభుత్వం గ్రంధాలయాలను పట్టించుకోలేదని ఆరోపించారు.