స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఖిలవరంగల్లో బిజెవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన 2కె రన్ ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంట రవి జెండా ఊపి ప్రారంభించారు. దేశ యువత స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలన్నారు. వరంగల్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడం కోసం ప్రతి ఒక్కరు పాటు పడాలని గంట రవి కోరారు.