వరంగల్ కాశిబుగ్గ ప్రధాన రహదారిలో మంగళవారం అర్ధరాత్రి నీటి పైపులైన్ ను ధ్వంసం చేశారు. బుధవారం దీంతో తెల్లవార్లు నీరు వృథాగా పోయింది. గురు, శుక్రవారాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు ప్రకటించారు. ప్రధాన పైపులైన్ లీకవడంతో పెద్ద గుంత ఏర్పడింది. అటుగా వెళ్లే వారికి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. మెగా గ్యాస్ సంస్థ వారు బల్దియా అధికా రులకు సమాచారం ఇవ్వకుండానే సంస్థ పనుల కోసం తవ్వకాలు చేపట్టారు.