ఓవర్ లోడ్ వేసుకొని డిసిఎం వాహనాలు వెళ్లడం వల్ల లారీ ఓనర్లు నష్టపోతున్నారని ది వరంగల్ డిస్ట్రిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వేముల భూపాల్ అన్నారు. బుధవారం వరంగల్ డీటీవో లక్ష్మిని కలిసి వినతిపత్రం అందజేశారు. పది టన్నుల కెపాసిటీ 3, కలిగిన డీసీఎంల్లో 23 టన్నుల ఓవర్ లోడ్ వేస్తున్నారని తెలిపారు. లారీల్లో 21 టన్నుల లోడ్ మాత్రమే వేస్తున్నామని చెప్పారు.