మంత్రి ఆలయాలను పట్టించుకోరా.?

55చూసినవారు
మంత్రి ఆలయాలను పట్టించుకోరా.?
దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొండా సురేఖ స్థానిక దేవాలయాలను పట్టించుకోరా అని శనివారం బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి ఆడెపు వెంకటేష్ ప్రశ్నించారు. దసరా వేడుకలను వైభవోపేతంగా నిర్వహిస్తున్న వరంగల్ సంస్కృతి వారికి తెలియదా అని అడిగారు. దేవి నరవరాత్రులు జరుగుతున్న నేపథ్యంలో నగరంలోని దేవాలయాలకు కనీస విద్యుత్ అలంకరణ మంత్రి మరిచినట్టున్నారని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్