బొల్లికుంటలో అగ్నిప్రమాదం

9381చూసినవారు
ఖిలా వరంగల్ మండలం బొల్లికుంట వాగ్దేవి కళాశాల ఎదురుగా ఉన్న ఓ దాబాలో శుక్రవారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. కిచెన్ గదిలో షార్ట్ సర్క్యూట్ కాగా ఆ మంటలు చుట్టుపక్కలకు వ్యాపించాయి. అయితే ఇందులో కంటైనర్ గదులను ఏర్పాటు చేయగా మండుతున్న ఎండలకు తోడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడుతున్న మంటలను అదుపు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్