వరంగల్ లక్ష్మిపురం కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల సొసైటీ ఆధ్వర్యంలో క్రిస్టమస్ పండుగ ను పురస్కరించుకుని బుధవారం కాశిబుగ్గ జంక్షన్ లో ఉచితంగా కూరగాయలు పంపిణీ చేసారు. సుమారు క్వింటా కూరగాయలను పండుగ సందర్భంగా పంపిణీ చేసినట్లు అధ్యక్ష కార్యదర్శులు తెలిపారు.