ప్రజలకు ఎల్లవేళలా కొండా కుటుంబం అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీ అన్నారు. శుక్రవారం వరంగల్ తూర్పు నియోజకవర్గం ఓసిటీలోని కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. పలు సమస్యలపై అధికారులకు సూచనలు చేశారు. ప్రజలు ఏ సమస్యలున్నా తన దృష్టికి కానీ, మంత్రి సురేఖ దృష్టికి గాని తీసుకురావాలని ప్రజలకు ఎల్లవేళలా కొండా కుటుంబం అండగా ఉంటుందని మరోమారు ప్రజలకు స్పష్టం చేశారు.