రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ మంగళవారం నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ లతో కలసి వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ను పరిశీలించారు. రైతులు, వ్యాపారులు, విక్రయదారుల సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.