ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే సోమవారం రాష్ట్రమంత్రి కొండ సురేఖ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ, జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ పుష్పగుచ్చం అందించి సాదర స్వాగతం పలికారు, అనంతరం ఆలయ పోలీసుల గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు.