రౌడీ రాజమ్మ అరెస్ట్

79చూసినవారు
బిల్ల సుమలత వరంగల్ ఎంజీఎంలో రెండేళ్ల నుంచి పేషెంట్ కేర్ విభాగంలో పని చేస్తోంది. ఈనెల 9న విధుల్లో భాగంగా ఎంజీఎం బయోమెట్రిక్ మిషన్ వద్ద వేలిముద్ర వేస్తుండగా ఆలకుంట రాజమ్మ అడ్డుకొని రూ. 2 లక్ష లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తానని బెదిరించింది. ఇనుప గొలుసుతో సుమలతపై దాడి చేసి గాయపరిచింది. ఆమె వద్ద ఉన్న రూ. 10వేలు లాక్కొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. మంగళవారం సాయంత్రం రాజమ్మను అరెస్టు చేసినట్లు ఏసీపీ తెలిపారు.

సంబంధిత పోస్ట్