వరంగల్ రంగశాయిపేట శ్రీ సాయి నగర్లో ఆదివారం వివేకానంద జన్మదిన వేడుకలను బుల్లోజు కృష్ణమూర్తి, బోళ్ళ అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కాలనీ ఏర్పడిన తర్వాత కీర్తిశేషులు దాసి సాంబయ్య, బుల్లోజు కృష్ణమూర్తి స్వామి వివేకనంద విగ్రహాన్ని స్థాపించారని అన్నారు. వివేకానందునికి యువతతో చాలా లోతైన అనుబంధం ఉందని, అందుకే తన పుట్టినరోజు యువతకు అంకితం ఇస్తూ యువజన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందన్నారు.