వరంగల్ మహానగరాన్ని రెండవ రాజధానిగా అభివృద్ధి చేయుటకు అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సోమవారం నగరంలోని భద్రకాళి ట్యాంక్బండ్ సుందరీకరణ పనులను, చెరువు బొంది వాగు వరద నివారణ పనులను, నిర్మిస్తున్న భద్రకాళి మాడ వీధులను పరిశీలించి పనులలో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భద్రకాళి చెరువు కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు