కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రులు కాళోజి కళాక్షేత్రానికి 300 గజాల జాగ ఇవ్వలేదని హనుమకొండ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు హనుమకొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ వాదులపై తుపాకులు ఎక్కుపెట్టిన వారు కాళోజీ కళా క్షేత్రాన్ని ప్రారంభించడం కాళోజీ ఆత్మ ఘోషిస్తుందన్నారు. 95 శాతం కాళోజీ కళాక్షేత్రం పనులు బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి అయ్యాయన్నారు.