నేడు డయల్ యువర్ డిఎం
By KK REDDY 567చూసినవారుఆర్టీసీ ప్రయాణీకుల నుంచి సలహాలు, సూచనలు, సమస్యలు తెలుసుకోవడానికి శనివారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ ధరం సింగ్ తెలిపారు. జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలావరంగల్, హనుమకొండ, హసన్‌పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజిపేట మండలాల పరిధిలోని ప్రయాణీకులు 9959226040 నెంబర్‌కు ఫోన్ చేసి తమ సమస్యలు, సలహాలు అందించాలన్నారు.