ఈనెల 10వ తేదీన జిల్లాలో నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ(నట్టల నివారణ ) కార్యక్రమాన్ని వైద్య ఆరోగ్య శాఖతో పాటు సంబంధిత శాఖలన్ని సమిష్టిగా విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య అన్నారు. బుధవారం కలెక్టరేట్లో నులి పురుగుల నివారణ దినోత్సవం పై జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ వంద శాతం పూర్తయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.