ప్రజా సమస్యల పరిష్కారం పై శ్రద్ధ వహించాలని బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమిషనర్ పాల్గొని వివిధ సంబంధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను స్వీకరించి పరిష్కార నిమిత్తం ఆయా విభాగాల ఉన్నతాధికారులకు అందజేశారు. సీఎం నగర పర్యటన సందర్భంగా అధికారులు చిత్తశుద్ధితో విధులు నిర్వహించారన్నారు.